యోగాసనాలు వేస్తున్న ఎమ్మెల్యే సంజయ్, కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్
యోగా సాధన చేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది
ఎస్పీ కార్యాలయంలో యోగా చేస్తున్న ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం/జగిత్యాలటౌన్: యోగా దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అశోక్‌కుమార్, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ పునుషోత్తంరెడ్డి, సీఐలు ఎస్సైలు పాల్గొన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జగిత్యాల బల్దియా చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది ఆసనాలు వేసి యోగా ప్రాముఖ్యతను వివరించారు. డీఎంహెచ్‌వో సుజాత, ఆయుష్ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.


