బీఆర్‌ఎస్‌ పాలనలోనే రైతులకు న్యాయం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ పాలనలోనే రైతులకు న్యాయం

Jun 21 2026 6:22 AM | Updated on Jun 21 2026 6:22 AM

ధర్మపురి: బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులకు అన్నివిధాలా న్యాయం జరిగిందని డీసీఎమ్మెస్‌ మాజీ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పట్టణంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ఖండించారు. గతంలో 33 పంటలకు బోనస్‌ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఏడు పంటలకు మాత్రమే ఇస్తామని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడదన్నారు. బీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ అయ్యోరి రాజేశ్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ సంగి సత్తమ్మ, పట్టణ అధ్యక్షుడు రంజిత్‌, రాంచందర్‌గౌడ్‌, మహేశ్‌, సింహాచలం, జగన్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement