అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Jun 21 2026 6:22 AM | Updated on Jun 21 2026 6:22 AM

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌: అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ తెలిపారు. జగిత్యాల రూరల్‌ మండలం ఒడ్డెరకాలనీకి చెందిన బోదాసు లావణ్య, నర్సయ్య గృహప్రవేశం చేయగా.. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏళ్ల తరబడి ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలంతా సొంతింటి నిర్మాణంతో ఆనందంగా ఉన్నారన్నారు. నాయకులు నోముల శేఖర్‌రెడ్డి, నక్కల రవీందర్‌రెడ్డి, ఆదిరెడ్డి పాల్గొన్నారు.

ఎరువుల కొరతకు కేంద్రమే కారణం

రాయికల్‌: యూరియా కొరతకు కేంద్రమే కారణమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని తాట్లవాయిలో రూ.33 లక్షలతో, భూపతిపూర్‌లో రూ.15 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. పట్టణంలో 40 మందికి రూ.12.60 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌, 17 మందికి కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. యూరియాను యాప్‌ ద్వారా ఇవ్వాలని కేంద్రమే ఆదేశాలు ఇచ్చిందని, ఈ విషయంలో ఎంపీకి కనీస అవగాహన లేదని పేర్కొన్నారు. మండలానికి రూ.2.30 కోట్లతో ఈజీఎస్‌ రోడ్లు మంజూరైనట్లు తెలిపారు. ఉప్పుమడుగు, లింగాపూర్‌, దావన్‌పల్లి, కండ్లపల్లి–కిష్టంపేట, మూటపల్లి–కొత్తపేట డబుల్‌రోడ్‌, కొత్తపేట, ఒడ్డెలింగాపూర్‌, ఒడ్డెరకాలనీకి రోడ్డు, మూటపల్లి–కొత్తపేట డబుల్‌రోడ్‌, లింగాపూర్‌, తాట్లవాయి డబుల్‌రోడ్డు పనులు ప్రారంభమయ్యాయన్నారు. సర్పంచులు ఆకుల మల్లేశం, గుర్రం భావన, ఆత్మ చైర్మన్‌ గంగారెడ్డి, మాజీ ఎంపీపీ సంధ్యారాణి, మాజీ సర్పంచ్‌ జక్కుల చంద్రశేఖర్‌, రాగి సాగరిక, ఉపసర్పంచులు, నాయకులు మోర హన్మండ్లు, కోల శ్రీనివాస్‌, తంగెళ్ల రమేశ్‌, ముఖీద్‌, పృథ్వీరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement