నా విజయం.. నాన్నకు అంకితం | - | Sakshi
Sakshi News home page

నా విజయం.. నాన్నకు అంకితం

Jun 21 2026 6:22 AM | Updated on Jun 21 2026 6:22 AM

నా విజయం.. నాన్నకు అంకితం

జ్యోతినగర్‌(రామగుండం): నేను ఈ స్థాయికి రావడానికి నాన్న ఉమామహేశ్వర్‌ చూపిన క్రమశిక్షణే కారణం. ఆయన ప్రోత్సాహంతో ఇటీవల యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌లో ఆల్‌ ఇండియా 78వ ర్యాంకు సాధించా. నాన్న పర్యావరణవేత్త, రైతు. అమ్మ న్యాయవాది. అన్నయ్య ఆదిత్య హైదరాబాద్‌లో ఓ సంస్థలో పని చేస్తున్నారు. వదిన పూజా చెబ్రోలు అమెరికాలోని వెయిల్‌ కార్నెల్‌ మెడిసిన్‌లో, వైద్య ప్రపంచ ఆరోగ్య విభాగంలో సహాయ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబం అండతో ఈ స్థాయికి ఎదిగాను. చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి, సమయపాలన, క్రమశిక్షణ, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వాన్ని నాన్న నేర్పించారు. యూపీఎస్సీ వంటి క్లిష్టమైన పరీక్షలో విజయం సాధించడానికి కుటుంబ ప్రోత్సాహం ఎంతో కీలకం. నా విజయం నాన్నకు అంకితం. యువత పట్టుదలతో ముందుకు సాగితే గుర్తింపు సాధించవచ్చు.

– శశాంక్‌ దహెగాం,

ఎన్టీపీసీ, రామగుండం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement