కోరుట్ల: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలు చేరుకోవాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. పట్టణంలో శనివారం నియోజకవర్గస్థాయి ప్రజాపాలన ప్రగతి నివేదిక సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి పట్టణం వరకూ చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను వేగంగా పరిశీలించడంతోపాటు అర్హత ప్రమాణాలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భూ సమస్యలు, రేషన్‌కార్డులు, పింఛన్ల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బాలల భద్రత, డ్రగ్స్‌రహితంపై ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీవో జీవాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత, కౌన్సిలర్లు, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సర్పంచులు పాల్గొన్నారు.


