మల్యాల/కొడిమ్యాల: ధాన్యాన్ని తూకం వేయడంతో జాప్యం చేయొద్దని కలెక్టర సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని ముత్యంపేటలో కేంద్రాలను శనివారం సందర్శించారు. తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ తిరుపతి, అధికారులు ఉన్నారు. అనంతరం కొడిమ్యాల మండలకేంద్రంతోపాటు గంగారంతండా, చెప్యాలలోని కేంద్రాలను సందర్శించారు. ధాన్యంలో తేమశాతంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీఎస్‌వో జితేందర్, ఫుడ్ ఇన్స్‌పెక్టర్ స్వామి, తహసీల్దార్ నరేష్, ఏపీఎం మల్లేశం, సర్పంచ్ వినోద్, సీసీలు వీరకుమార్, మరియా, రైతులు పాల్గొన్నారు.


