జగిత్యాలకు రాం రాం! | - | Sakshi
Sakshi News home page

జగిత్యాలకు రాం రాం!

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

బల్దియాకు అవినీతి మచ్చ అటు ఏసీబీ, ఇటు విజిలెన్స్‌ మూకుమ్మడి దాడులు బదిలీపై రావడానికి జంకుతున్న అధికారులు.. ఉన్నవారు కూడా వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు గాడిన పెట్టేదెవరు?

జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీ అంటే ప్రస్తు తం ప్రతీ నోట వినిపిస్తోంది. అవినీతికి కేరాఫ్‌ జగిత్యాల మున్సిపాలిటీగా ముద్రపడింది. ఇందులో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై తరుచూ ఫిర్యాదులు చేయడం, అటు ఏసీబీ అధికారులు, ఇటు విజిలెన్స్‌ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. ప్రతీ శాఖలో రికార్డులు తనిఖీ చేస్తున్నారు. గతంలో కొందరు అధికారులు చేసిన తప్పిదాల వల్ల జగిత్యాల మున్సి పాలిటీపై ఇప్పటికీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శానిటేషన్‌ విభాగంలో గతంలో జరిగిన డీజిల్‌ కుంభకోణంతో పాటు, ము న్సిపల్‌ ట్రాక్టర్లు మాయమైన సంఘటన తెలిసిందే. అలాగే రెవెన్యూ విభాగంలో అసెస్‌మెంట్‌కు సంబంధించి అనేక ఆరోపణలొచ్చాయి. ఓ భూమికేసులో మున్సిపల్‌ కమిషనర్‌తో పాటు, ఆర్వో సైతం జైలుకెళ్లారు. ఇ లాంటి అవకతవకలు అనేకం జరుగుతుండటంతో కొందరు సీడీఎంఏకు ఫిర్యాదు చేయడంతో వారు సైతం జగిత్యాలపై నిఘా పెట్టారు. ప్రతీ వి భాగంలో అవకతవకలు జరిగినట్లు వెలువడటంతో జగిత్యాల మున్సిపాలిటీపై దృష్టి సారించారు. ఆస్తిపన్ను విషయంలో సైతం ఓ అధికారి సొంతానికి వాడుకున్నట్లు బయటకు రావడంతో ఆ అధికారిని సస్పెండ్‌ చేసి డబ్బును రికవరీ చేశారు. ఇలా ఒకటే కాకుండా ప్రతీ విషయంలోనూ అవినీతి ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. మ్యూటేషన్లకు సంబంధించి అక్రమాలు, పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం, కార్మికులకు సంబంధించిన పీఎఫ్‌ పట్టించుకోకపోవడం, ట్రేడ్‌ లైసెన్స్‌లు, ఇంజినీరింగ్‌ సెక్షన్‌లో వాటర్‌ చార్జీలు, టెండర్లు సక్రమంగా లేకపోవడం, ముఖ్యంగా మున్సిపల్‌ కాంప్లెక్స్‌లకు సంబంధించి టెండర్లు వేయకపోవడం లాంటివన్నింటినీ ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ప్రతీ విభాగానికి సంబంధించిన అన్ని ఫైల్స్‌ పట్టుకెళ్లడంతో పాటు, ఇంటి అనుమతులతో పాటు, ఇతరాత్ర వాటి కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫోన్‌ నంబర్లు సైతం తీసుకెళ్లి వారికి ఫోన్‌ చేస్తున్నారు. నెల రోజుల క్రితం ఏసీబీ అధికారులు వచ్చి 10గంటల పాటు మున్సిపల్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించగా మరో వారం రోజుల వ్యవధిలోనే విజిలెన్స్‌ అధికారులు వచ్చి 17 టీంలుగా విభజించి భవనాల కొలతల్లో తేడాలున్నాయ ని అన్నింటినీ కొలిచి రికార్డు తీసుకెళ్లారు. ఇలా జగిత్యాల మున్సిపాలిటీలో మొదటి నుంచి అవినీతి ఆరోపణలే వెల్లువెత్తుతున్నాయి.

బదిలీపై వచ్చేందుకు జంకుతున్న అధికారులు

జగిత్యాల మున్సిపాలిటీకి బదిలీపై వచ్చేందుకు అధికారులు జంకుతున్నారు. సీడీఎంఏ నుంచి జగిత్యాల మున్సిపాలిటీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయితే అక్కడిదక్కడే మార్పులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో పోస్టులు అనేకం ఖాళీగా ఉన్నాయి. శానిటరి ఇన్‌స్పెక్టర్‌ లేకపోవడం, రెవెన్యూ సెక్షన్‌లో ఆర్వోలు, ఇన్‌చార్జిలుగా ఉండటం, టౌన్‌ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌ సెక్షన్‌లలో అనేకంగా ఖాళీగా ఉన్నాయి. ఇటీవల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ సైతం సీడీఎంఏ కమిషనర్‌కు పోస్టులు భర్తీ చేయాలని లేఖ సైతం ఇచ్చారు. కానీ జగిత్యాల మున్సిపాలిటీ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారడంతో ఒక్క అధికారి సైత ం ఇక్కడకు రావడానికి భయాందోళనకు గురవుతున్నట్లు తెలిసింది. గతంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఎక్కడ మాపైన ఆరోపణలు వస్తాయోనని రావడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అధికారుల్లో గుబులు

గతంలో జరిగిన సంఘటనలకు మేమెక్కడ బాధ్యులవమవుతామోనని ప్రస్తుతం పనిచేస్తున్న అధికా రులు భయాందోళనకు గురవుతున్నారు. శానిటేషన్‌లో నాలుగు ట్రాక్టర్లు మాయమైన సంఘటనపై కమిషనర్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తె లిసిందే. అంతేకాక ఇటు ఏసీబీ అధికారులు, అటు విజిలెన్స్‌ అధికారులు అన్ని ఫైల్స్‌ తీసుకెళ్లి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారులు నేరుగా సీడీఎంఏకే ఫైల్స్‌ పంపించనున్నారు. సంబంధిత అధికారులను బాధ్యలను చేసే అవకాశం ఉండటంతో చే య ని తప్పుకు తాము బాధ్యులమవుతామోనని భయా ందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్‌, మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు చొర వ చూపి మున్సిపాలిటీని గాడిలో పడేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

నిత్యం ఫిర్యాదులు, అధికారుల దాడుల నేపథ్యంలో జగిత్యాల కమిషనర్‌గా పనిచేస్తున్న స్పందన బదిలీపై వెళ్లగా నూతన కమిషనర్‌గా గ్రూప్‌–1 ఆఫీసర్‌ సత్యప్రణవ్‌ నియమితులయ్యారు.ఇక్కడ కమిషనర్‌గా చేయాలంటే సవాళ్లతో కూడుకున్నదే. గతంలో అన్ని శాఖలో అవినీతి ఆరోపణలు రావడం, ప్రస్తుతం వాటిపై విచారణ చేస్తుండటంతో కమిషనర్‌గా వచ్చిన వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నూతనంగా వచ్చిన కమిషనర్‌ అటు అభివృద్ధి వైపు చూడటంతో పాటు, ఇటు ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గాడిన పడేదెలా..

మున్సిపాలిటీకి ఇటీవలే కొత్త పాలకవర్గం ఏర్పడింది. చైర్‌పర్సన్‌గా సమిండ్ల వాణి కొనసాగుతున్నారు. పూర్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మున్సిపాలిటీని గాడిన పడేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉంది. ముఖ్యంగా రెవెన్యూ, శానిటేషన్‌, టౌన్‌ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌ సెక్షన్‌, ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement