మున్సిపాలిటీలో కనిపించని నర్సరీలు ముందుకు సాగని పనులు
జగిత్యాల: యాసంగి సీజన్‌కు సంబంధించి వరిధాన్యం సేకరణ పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. యాసంగి సీజన్‌కు సంబంధించి దిగుమతుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, కేంద్రాల వద్ద క్లస్టర్స్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ వందశాతం పూర్తి చేయాలి
ఫార్మర్ రిజిస్ట్రేషన్ వందశాతం పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టర్‌తో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను జూన్ 2లోపు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈనెల 4నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే ఫార్మర్స్ వీక్‌ను విజయవంతం చేయాలని తెలిపారు. రైతులకు మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ లత, రాజాగౌడ్ పాల్గొన్నారు.
హరితహారానికి
నిధుల లేమి
ధర్మపురి: పల్లెల్లో పచ్చదనం పంచేందుకు ప్రభుత్వం హరితహారం కింద ఏటా నిధులు వెచ్చిస్తుంది. ఇందులో భాగంగా పల్లెల్లో గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసి అందులో మొక్కలు పెంచుతోంది. గతేడాది పనులు సవ్యంగా సాగినప్పటికీ ఈఏడాది నత్తనడకన సాగుతున్నాయి. ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచి జూన్ వరకు హరితహారం కార్యక్రమానికి అందించాల్సి ఉంటుంది. కానీ.. ఈ ఏడాది మున్సిపాలిటీలలో మొక్కలు పెంపకానికే ఇంకా అడుగులు ముందుకు పడలేదు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో హరితహారం మొక్కలపై నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 2023 నవంబర్ నాటికి నర్సరీల టెండర్లను పూర్తి చేసుకొని డిసెంబర్‌లో విత్తనాలు పెట్టి మొక్కలను పెంచి జూన్ వరకు అందించారు. ఈ సారి పనులన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి.
నర్సరీల్లో పాత మొక్కలే దర్శనం
మున్సిపాలిటీల్లోని నర్సరీల్లో పాత మొక్కలే దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి మార్చి, ఏప్రిల్, మే నెలలో నీరుపట్టి జూన్ వరకు మొక్కలు పెంచి ప్రజలతోపాటు ఆయా విభాగాలకు అందించాల్సి ఉంటుంది. ఈ ఏడాది పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికారులు నర్సరీల వైపు దృష్టి సారించలేకపోయారు.
మొక్కుబడిగా పనులు
ఈ ఏడాది హరితహారం పనులు మొక్కుబడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నర్సరీల్లో మొక్కలు లేకపోవడంతో జూన్ వరకు హరితహారం కార్యక్రమం ముందుకుసాగే పరిస్థితి లేదు. నర్సరీల్లో పాత మొక్కలే తప్ప కొత్త మొక్కలు కానరావడం లేదు. నిధుల కొరత, కూలీల కొరత, నీటి సమస్య మొక్కల పెంపకానికి అడ్డంకిగా మారాయి.
మొక్కల పెంపకం లక్ష్యాలు (2025–2026)
బల్దియా లక్ష్యం పాత మొక్కల నిల్వ
ధర్మపురి లక్ష 3800
జగిత్యాల 39,000 1,12,500
కోరుట్ల 1,54,300 75,000
మెట్‌పెల్లి 1,27,400 56,300
రాయికల్ 89,000 3570


