జయంతిని విజయవంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

జయంతిని విజయవంతంగా నిర్వహించాలి

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 10నుంచి 12వరకు నిర్వహించనున్న హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాల ను సమష్టిగా విజయవంతంగా నిర్వహించాల ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నా రు. శుక్రవారం ఉత్సవాల పోస్టర్‌ను ఆలయ ఈవో అంజనారెడ్డి, అర్చకులతో కలిసి ఆవిష్కరించారు. పారిశుధ్య కార్మికుల దినసరి కూలీ పెంపుపై హర్షం వ్యక్తం చేశారు. మరో ఐదు పా రిశుధ్య కార్మికుల పోస్టులు మంజూరు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో నీలం రవి, సర్పంచ్‌ దారం ఆదిరెడ్డి, బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, స్థానా చార్యులు కపీందర్‌, ప్రధాన అర్చకుడు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, ఏఈవో హరిహరనాథ్‌, సూపరింటెండెంట్‌ సునీల్‌ పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమానికి కృషి

కోరుట్ల: కార్మికుల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని కటుకం సంఘయ్య ఫంక్షన్‌హాల్‌లో కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లోని వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న కార్మికులకు తన సొంత నిధులతో లేబర్‌, ఇన్సూరెన్స్‌ కార్డులను అందజేశారు. అనంతరం బ్యాంకు ఎల్‌డీఎం రామ్‌ కార్మికులకు చిరు వ్యాపారాలపై అవగాహన కల్పించారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌, నాయకులు గడ్డం మధు, టేకుల నరేశ్‌, ఫయీం, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

డీసీఆర్బీ సీఐకి

డీఎస్పీగా పదోన్నతి

జగిత్యాలక్రైం: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో డీసీఆర్బీ సీఐగా పనిచేస్తున్న శ్రీని వాస్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్రీనివాస్‌ శుక్రవారం ఎస్పీ అశోక్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేయగా, శ్రీనివాస్‌కు పదోన్నతి స్టార్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పనిచేస్తూ ఎన్నోఏళ్లుగా ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికి పదోన్నతి గొప్ప గుర్తింపు అన్నారు.

గ్రామపంచాయతీలకు నిధుల కేటాయింపు లేదు

జగిత్యాలరూరల్‌: గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. మే డే దినోత్సవం సందర్భంగా శుక్రవారం జగిత్యాలరూరల్‌ మండలం చల్‌గల్‌ గ్రామపంచాయతీ వద్ద పంచాయతీ కార్మికులను సన్మానించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నుంచి వస్తున్న నిధులు తప్ప జీపీలకు రాష్ట్ర ప్రభుత్వ ం నుంచి నిధులు రావడం లేదన్నారు. దీంతో కార్మికులకు వేతనాలు చెల్లింపు పంచాయతీల పై భారం పడుతుందన్నారు. మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, మాజీ వైస్‌ చైర్మన్‌ హరిచరణ్‌రావు, సర్పంచ్‌ రాజేందర్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా కార్యవర్గం

జగిత్యాల: ప్రభుత్వ వైద్యు ల సంఘం జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అమరేశ్వర్‌, ప్రధాన కార్యదర్శిగా ముస్కు జైపాల్‌రెడ్డి, కోశాధికారిగా నవీన్‌లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement