జగిత్యాల: బాలల భరోసా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మేడేతో పాటు, బాల భరోసా, నశాముక్త్ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆరేళ్లలోపు పిల్లలు అంగవైకల్యానికి గురికాకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం బాల భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, డ్రగ్స్ రహిత తెలంగాణ ము ఖ్య మంత్రి లక్ష్యమని తెలిపారు. చిన్నారులకు వివిధ పరీక్షలు చేసి లోపాలు ఉంటే వెంటనే మెడికల్ ట్రీట్‌మెంట్ అందించి వైకల్యం రాకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18లక్షల చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మేడే సందర్భంగా కార్మిక శాఖ ద్వారా అందుతున్న పథకాలను జిల్లాలోని అసంఘటిత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నశాముక్త్ కార్యక్రమంలో భాగంగా జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పో లీసులు కృషి చేయాలని, ఈగల్ టీం పేరుతో ఒక ఐపీఎస్ అధికారిని నియమించి డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ బాలభరోసా పథ కం ఎంతో గొప్పదని, పిల్లల్లో ఉన్న వైకల్యాలను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడం జరుగుతుందన్నారు. శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ అనిత రాంచంద్రన్ మాట్లాడుతూ బాల భరోసా పథకం కింద పిల్లలకు వైద్యం నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన కుటుంబా లకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం మేడే సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను సత్కరించారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, దివ్యాంగుల శాఖ డైరెక్టర్ శైలజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి
గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఐసీడీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు పరిష్కరించాం
జగిత్యాలటౌన్: తెలంగాణ ఏర్పాటులో కీలక పా త్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్బంగా శుక్రవారం ఆర్టీసీ డిపోలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి జెండా ఆవిష్కరించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కేవలం మూడు రోజుల్లోనే వారితో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించామన్నారు.


