క్రీడా శిక్షణకు వేళాయే | - | Sakshi
Sakshi News home page

క్రీడా శిక్షణకు వేళాయే

May 1 2026 8:08 AM | Updated on May 1 2026 8:08 AM

కథలాపూర్‌(వేములవాడ): గ్రామీణప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికితీసేందుకు క్రీడా ప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుంచి 31వరకు క్రీడా పోటీలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెలపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల మైదానాల్లో శిబిరాలు నిర్వహించనున్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు పీడీలు, పీఈటీలు, సీనియర్‌ క్రీడాకారులను 12 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు.

శిబిరాల నిర్వహణ ఇలా..

అథ్లెటిక్స్‌: ఎండపల్లి జెడ్పీ హైస్కూల్‌.

బ్యాడ్మింటన్‌: కొడిమ్యాల జెడ్పీ హైస్కూల్‌, గొల్లపల్లి మండలం చందోలి జెడ్పీ హైస్కూల్‌.

బాస్కెట్‌బాల్‌: రాయికల్‌ మండలం అల్లీపూర్‌, సా రంగాపూర్‌ మండలం కోనాపూర్‌ జెడ్పీ హైస్కూల్‌.

బాక్సింగ్‌: జగిత్యాలరూరల్‌ మండలం జాబితాపూర్‌ ఉన్నత పాఠశాల.

తైక్వాండో: మేడిపెల్లి జెడ్పీ హైస్కూల్‌.

వాలీబాల్‌: వెల్గటూర్‌ జెడ్పీ హైస్కూల్‌, కథలాపూర్‌ జెడ్పీ హైస్కూల్‌, కోరుట్ల మండలం అయిలాపూర్‌ జెడ్పీ హైస్కూల్‌, మెట్‌పల్లి మినీ స్టేడియం.

కరాటే: జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో శిబిరాలుంటాయి. ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఉంటుంది.

నేటి నుంచి వేసవి శిబిరాలు

జిల్లాలో 12 కేంద్రాల గుర్తింపు

Advertisement
 
Advertisement
Advertisement