మెట్‌పల్లి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా మాధవి | - | Sakshi
Sakshi News home page

మెట్‌పల్లి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా మాధవి

May 1 2026 8:02 AM | Updated on May 1 2026 8:02 AM

మెట్‌పల్లి: పట్టణంలోని జూనియర్‌ సివిల్‌ కోర్టు మేజిస్ట్రేట్‌గా వినుకొండ మాధవి గురువారం బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న అరుణ్‌కుమార్‌ను రంగారెడ్డి జిల్లా అమనగల్లుకు బదిలీ చేసి.. ఆయన స్థానంలో మాధవిని నియమించారు. ఆమెను బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏలేటి రాంరెడ్డి, పలువురు న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కొండగట్టులో పూజలు

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మెట్‌పల్లి జూనియర్‌ సివిల్‌, ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ వినుకొండ మాధవి కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించారు. నీతి ఆయోగ్‌ రూపొందించిన దివ్య భారత్‌ నివేదికలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం స్థానం పొందడంపై ఆలయ ఈవో అంజనారెడ్డి, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement