‘ఉపాధి’లో కూలీల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’లో కూలీల సంఖ్య పెంచాలి

May 1 2026 8:02 AM | Updated on May 1 2026 8:02 AM

డీఆర్డీఏ పీడీ రఘువరణ్‌

రాయికల్‌: ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని డీఆర్డీఏ పీడీ రఘువరణ్‌ అన్నారు. గురువారం మండలంలోని రాజనగర్‌లో కందకాల పనులు, వన నర్సరీ, గ్రామైఖ్య సంఘం భవన నిర్మాణాలను పరిశీలించారు. ఉపాధి పని ప్రదేశాల్లో సదుపాయాలు కల్పించాలని, సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం కూలీలు పనులు చేయాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 6 గంటల వరకు పనుల్లోకి రావాలని అన్నారు. ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్‌ భారతపు రాజేశ్‌, ఏపీవో దివ్య, టెక్నికల్‌ అసిస్టెంట్లు విజయ్‌, రాజేందర్‌, పంచాయతీ కార్యదర్శి వెంకటాచలం, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజేందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement