కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌వోబీ) నిర్మాణ పనుల్లో విపరీత జాప్యం పట్ల మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పనులు పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలో గుంతల రోడ్డు, దుమ్ముతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూసేకరణ సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ఆశించిన స్థాయిలో సాగడంలేదన్నారు. ఎలాంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టు ప్రత్యేక చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయాలన్నారు. పనులు ప్రారంభించిన ఒక పక్క త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు కొంత ఇబ్బందులను తొలగించాలన్నారు. కార్యక్రమంలో రైల్వే ఏడీఈఎన్ భిక్షపతి, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సంతోష్, సాదినేని మునిందర్ తదితరులు పాల్గొన్నారు.


