ఇబ్రహీంపట్నం: లారీల కొరత తీర్చాలని, మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చే స్తూ.. రైతులు వ్యవసాయ మార్కెట్‌యార్డు ముందు రోడ్డుపై బైఠాయించారు. 20వేల బస్తాలు ఐదు రోజుల క్రితం కాంటా అయ్యాయయని, లారీలు రాకపోవడంతో కొనుగోళ్లు నిలిపివేశారని, అకాలవర్షం పడితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ వరప్రసాద్, ఎస్సై నవీన్‌కుమార్ రైతుల వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు నల్ల రమేశ్, రైతులు పాల్గొన్నారు.


