అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

రాయికల్‌: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. రాయికల్‌ మండలం అయోధ్య, పట్టణంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, అదనంగా మరో రెండు వేల ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానన్నారు. ఆత్మ చైర్మన్‌ కాటిపల్లి గంగారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ కట్కం రవి, కౌన్సిలర్లు రాకేశ్‌, పల్లికొండ గంగాధర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రవీందర్‌రావు, నాయకులు కోల శ్రీనివాస్‌, ఏనుగు మల్లారెడ్డి, గన్నె రాజిరెడ్డి, సురేశ్‌, వినోద్‌, నర్సయ్య, ముత్తయ్య, మాజీ సర్పంచ్‌ జీవన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ రాజేశం, మాజీ ఎంపీటీసీ రవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement