కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాలరూరల్‌: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ రైతులకు సూచించారు. రూరల్‌ మండలం చల్‌గల్‌, తాటిపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రాలను తనిఖీ చేశారు. పారదర్శకంగా, వేగంగా కొనుగోలు ప్రక్రియ సాగాలని అధికారులను ఆదేశించారు. వాహనాలను మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, తాగునీరు, షేడ్‌నెట్లు ఏర్పాటు చేయాలన్నారు. వాతావరణం మార్పుల దృష్ట్యా టార్పాలిన్‌ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆర్డీవో మధుసూదన్‌, డీఆర్డీవో రఘువరన్‌, తహసీల్దార్‌, ఎంపీడీవో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement