కొత్తపల్లి(కరీంనగర్): పదోతరగతి 2025–26 వార్షిక పరీక్షల ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులతో హవా కొనసాగించారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్‌లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో అత్యధిక మార్కులు సాధించినవారిని అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి అభినందించారు. అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌కు చెందిన ఆర్.సాత్విక్ 589/600 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, ఓ.ఆద్య, టి.రాజు, బి.అక్షిత్ రెడ్డి 588 మార్కులు సాధించినట్లు తెలిపారు. 1,274 మందికి 1,026 మంది 500 మార్కులు, ఆపై సాధించడం అభినందనీయమన్నారు. 48 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా సాధించగా. 334 మంది విద్యార్థులు 560 మార్కులు పైగా సాధించి సత్తాచాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


