కథలాపూర్: మండలంలో 99.08 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు. నక్క వేదాక్షరి 563 మార్కులతో మండల టాపర్‌గా నిలిచింది. మామిండ్ల లాస్యవర్ధిని 562 మార్కులతో ద్వితీయస్థానంలో నిలిచింది. భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్‌కు చెందిన కూన శ్రీహిత 560, గంభీర్‌పూర్ జెడ్పీ హైస్కూల్‌కు చెందిన పోతు మాధవి 560 మార్కులు సాధించారు. మండలంలో 12 ప్రభుత్వ పాఠశాలల నుంచి 436 మంది పరీక్ష రాయగా 432 మంది ఉత్తీర్ణులయ్యారు. తక్కళ్లపెల్లి, బొమ్మెన, కథలాపూర్ గంభీర్‌పూర్, పోతారం, తాండ్య్రాల జెడ్పీ హైస్కూల్, మోడల్ స్కూల్, కేజీబీవీ వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.
తండ్రి వ్యవసాయ కూలీ.. తల్లి టైలరింగ్
నక్క వేదాక్షరి తండ్రి వీవోఏ, వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. తల్లి టైలరింగ్ చేస్తోంది. ఒకగానొక్క కూతురు వేదాక్షరి మండల టాపర్‌గా నిలిచింది.
కూన శ్రీహిత
పోతు మాధవి
లాస్యవర్ధిని


