శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణం

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

మెట్‌పల్లిరూరల్‌: జగ్గాసాగర్‌లో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి(కొండస్వామి) బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బండలింగాపూర్‌లోని వేణుగోపాలస్వామి ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఎదుర్కోలుగా తీసుకొచ్చి కల్యాణం జరిపించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సర్పంచ్‌ పుల్ల జగన్‌గౌడ్‌, ఆలయ కమిటీ సభ్యులు, ఉపసర్పంచ్‌ లక్మ చిన్నయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లి

రాయికల్‌: మండలంలోని ఇటిక్యాలలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలతో శోభాయాత్రగా రేణుకాఎల్లమ్మ ఆలయానికి చేరుకుని నైవేద్యం సమర్పించారు. ఆలయంలో పట్నాలు వేశారు. అన్నప్రసాద వితరణ చేశారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

నృసింహుని సన్నిధిలో భక్తుల రద్దీ

ధర్మపురి: శ్రీలక్షీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి జయంత్యోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement