జగిత్యాల: బాలికల భద్రతకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. జిల్లాకేంద్రంలోని ఐడీవోసీలో బాలల భద్రత, డ్రగ్స్ వద్దని చెప్పండి కార్యక్రమంలో భాగంగా మంగళవా రం స్నేహగ్రూప్ కౌమార బాలికలకు అవగా హన కల్పించారు. బాల్య వివాహాలు, టీనేజ్‌లో గర్భధారణలు, ఎలో ప్మెంట్ కేసులు, ఆన్‌లైన్ ప్రేమలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు తదితర విషయాల గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజ్‌కుమార్, డీఆర్డీవో రఘువరన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి, ఎంప్లాయ్‌మెంట్ అధికారి సత్తమ్మ పాల్గొన్నారు.
భగ్గుమంటున్న భానుడు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 45.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి. ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లిలో 45.8, కోరుట్ల, పెగడపల్లి, కొడిమ్యాల మండలం పూడూర్, ఎండపల్లి మండలం గుల్లకోటలో 45.7, ధర్మపురి మండలం జైనా, బీర్‌పూర్ మండలం కొల్వాయి, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌లో 45.6, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 45.4, బుగ్గారం మండలం సిరికొండలో 45.3, మెట్‌పల్లి, రాయికల్, గొల్లపల్లిలో 45.1, కోరుట్ల మండలం అయిలాపూర్, అల్లీపూర్‌లో 45 డిగ్రీల చొప్పున నమోదైంది
రాయికల్ కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక
రాయికల్: రాయికల్ మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులను మంగళవారం ఎన్నుకున్నారు. ముందుగా చైర్మన్ కట్కం రవి, కమిషనర్ కీర్తి నాగారాజు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సభ్యుల మద్దతుతో కో–ఆప్షన్ సభ్యులుగా మాజీ వార్డు మెంబర్ సుధవేని లత, మాజీ కౌన్సిలర్ వల్లకొండ మహేశ్, మైనార్టీ కోటాలో ఇర్ఫాన్ ఆలీ, ఇంతియాజ్‌పర్వీన్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ తురగ సౌజన్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యపై దృష్టి
రాయికల్: రాయికల్ మున్సిపాలిటీలో తాగునీటి సమస్య, పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చైర్మన్ రవీందర్ తెలిపారు. బల్దియా కార్యాలయంలో ఆయన అధ్యక్షతన మంగళవారం సాధారణ సమావేశం నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ.. అమృత్–2 పనులు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరగా పూర్తి చేయాలని, సీసీ రోడ్లకు మరమ్మతు చేపట్టాలని కోరారు. అనంతరం 25అంశాలను ఆమోదించారు. కమిషనర్ కీర్తి నాగరాజు, వైస్ చైర్మన్ తురగ సౌజన్య, కౌన్సిలర్లు ప్రశాంతి, రాకేష్ నాయక్, మానస, మౌనిక, లతిక, గంగాధర్, మహేశ్వరి, గంగలక్ష్మి, శ్రీధర్, ధర్మపురి తదితరులు పాల్గొన్నారు.
అంజన్న సన్నిధిలో దేవాదాయ కమిషనర్ పూజలు
మల్యాల:కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి వారిని దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు, ధార్మిక సలహాదారు గోవిందహరి దర్శించుకున్నారు. అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శేషవస్త్రంతో ఈవో అంజనారెడ్డి సన్మానించారు. ఏఈఓ హరిహరనాథ్, సూపరింటెండెంట్ సునీల్, ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, చిరంజీవ స్వామి, స్థానాచార్యులు కంపీదర్ పాల్గొన్నారు.


