హిందూ ధర్మ సంరక్షణకు పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

హిందూ ధర్మ సంరక్షణకు పాటుపడాలి

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

రాయికల్‌: హిందూధర్మ పరిరక్షణకు హిందువులంతా ఐకమత్యంగా పాటుపడాలని అభయ హిందూ సేవా ఫౌండర్‌, భగవద్గీత ప్రచారకులు రాధామనోహర్‌ దాస్‌ పిలుపునిచ్చారు. పట్టణంలో మంగళవారం రాత్రి నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచమొత్తం మన దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని, మన ఆచార సంప్రదాయాలను అలవర్చుకుంటున్నాయని తెలిపారు. అలాంటి దేశాన్ని కొన్ని దుష్టశక్తులు విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని, వాటిని ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని కోరారు. ఆవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్టేనన్నారు. అనంతరం గోపూజ చేశారు. సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం, భజన సంకీర్తనలతో పట్టణం మారుమోగింది. తెలంగాణ ప్రాంత గ్రామ వికాస ప్రముఖ్‌ జిన్నా సత్యనారాయణ రెడ్డి, మచ్చ జ్యోత్స్న, హిందూ సమ్మేళన్‌ అధ్యక్షులు ఎలగందుల రమేశ్‌, ప్రధాన కార్యదర్శి దాసరి గంగాధర్‌, భక్తులు పాల్గొన్నారు.

ఆవుకు పూజ చేస్తున్న రాధామనోహర్‌ దాస్‌

హారతులు ఇస్తున్న మహిళలు

ఆవులో సకల దేవతలు

భగవద్గీత ప్రచారకులు రాధామనోహర్‌ దాస్‌

Advertisement
 
Advertisement
Advertisement