ధర్మపురి: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని సోమవారం కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్, దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు, కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి దర్శించుకున్నారు. వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలి కా రు. గోదావరి పుష్కరాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ధర్మపురితో పా టు భద్రాచలంలోని శ్రీరామచంద్రస్వామి, కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర, బాసరలోని సరస్వతీ అమ్మవారి ఆలయాలను అభివృద్ది చేస్తామన్నారు.
ధర్మపురిలో మాస్టర్‌ప్లాన్ అమలు
నృసింహస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ అమలు చేయాలని, ఇందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి అడ్లూరి అధికారులను ఆదేశించారు. 1400 ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మపురిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి వివేక్ అన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, ము న్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, దేవస్థానం ఈవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు.
మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, గడ్డం వివేక్‌వెంకటస్వామి


