● బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరిబాబు
మెట్‌పల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు సూచించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉందని, గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. కేంద్రం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రజల్లోకి తీసుకపోవాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూదరి అరుణ, అనూప్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెపల్లి శ్రీనివాస్, నాయకులు ధర్మపురి వేణు, కొయ్యల లక్ష్మణ్, లోలపు అనిల్ తదితరులున్నారు.
బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా నవీన్
బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నాయకులు దొనికెల నవీన్‌ను నియమించారు. నియామక పత్రాన్ని యాదగిరిబాబు అందించారు. నవీన్ గతంలో ఏబీవీపీ, బీజేవైఎంలో పలు పదవులు నిర్వహించారు. పట్టణంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.


