మక్కలు కొంటామంటూనే లేనిపోని నిబంధనలు పెట్టి రైతులను తిప్పలు పెడుతున్నారు. పంట పండించడం ప్రభుత్వ దృష్టిలో తప్పుగా మారింది. 40 క్వింటాళ్లు పండిస్తే 25 క్వింటాళ్లు కొంటామనడం ఎంతవరకు సబబు..? ప్రజాప్రతినిధులు ఆలోచన చేసి రైతులకు అండగా నిలవాలి.
– పన్నాల తిరుపతి రెడ్డి,
రైతు ఐక్యవేదిక నాయకుడు
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే మక్కలు కొంటున్నాం. కొనుగోలు చేసిన మక్కలను నిల్వ చేసేందుకు గోదాంలను పరిశీలిస్తున్నాం. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తాం.
ఎండీ.హబీబ్, జిల్లా మార్క్‌ఫెడ్ అధికారి


