జగిత్యాలక్రైం: మెట్‌పల్లి సీఐగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సురేశ్‌బాబు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అశోక్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
జగిత్యాలజోన్: కోర్టుల్లో పెండింగ్ కేసులు తగ్గించేందుకు జడ్జిలు కృషి చేస్తున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి అన్నారు. జిల్లా మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజకోహిర్కర్ గోదావరిఖని కోర్టుకు బదిలీ కాగా.. ఆమెకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ.. శ్రీనిజ తన మూడేళ్ల పదవి కాలంలో 1076 కేసులు పరిష్కరించారని తెలిపారు. కోర్టు బెంచ్‌కు న్యాయవాదులు, పోలీసులు సహకరించడంతోనే కేసులు పరిష్కారమయ్యాయని శ్రీనిజ పేర్కొన్నారు. సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్యశర్మ, రెండో అదనపు జుడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ఉపాధ్యక్షుడు సత్యం, ప్రధాన కార్యదర్శి అందె మారుతి పాల్గొన్నారు.
అడవి జంతువులకు ప్రాణహాని తలపెట్టొద్దు
జగిత్యాలక్రైం: వన్యప్రాణులకు ప్రాణ హాని తలపెడితే క్రి మినల్ కేసులు న మోదు చేస్తామని అటవీ శాఖ అధి కారి రవిప్రసాద్ తెలి పారు. సోమవారం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలో రైతు భూక్య రవి తన వరిపంటను రక్షించుకునేందుకు ఈనెల 21న విద్యుత్ కంచె ఏర్పాటు చేశాడని, విద్యుత్‌షాక్ తగిలి రెండు అడవి దున్నలు మృతిచెందాయని పేర్కొన్నారు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేశారని, కొంత భాగం దహనం కాకపోవడంతో అసలు విషయం వెలుగుచూసిందన్నారు. ఈ మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేశామన్నారు. రేచపల్లి బీట్ ఆఫీసర్ గోపాల్, సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌పై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామన్నారు. వన్యప్రాణులను కాపాడాల న్నారు. గ్రామాల్లోకి వస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు.
రాయికల్: రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ఆత్మ చైర్మన్ గంగారెడ్డి అన్నారు. మండలంలోని ఇటిక్యాలలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. సర్పంచ్ నీరటి శ్రీనివాస్, ఉపసర్పంచ్ సాయిరెడ్డి, ఆర్‌ఐ దేవదాసు, కార్యదర్శి రాజేశ్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరిస్తున్నాం
జగిత్యాలక్రై ం: ఎస్పీ కార్యాలయానికి వస్తున్న బాధితుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించగా.. 14మంది అర్జీలు సమర్పించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడారు. చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.


