స్వీయ గణన ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

స్వీయ గణన ప్రారంభం

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

● మే 10 వరకు అవకాశం ● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల: జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ సోమవారం ప్రారంభమైనట్లు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. జనగణన రెండు విడుతలుగా ఉంటుందని, మొదటి విడత మే 11 నుంచి జూన్‌ 9 వరకు ఇళ్ల గణన, రెండో విడతలో జనాభా గణన ఉంటుందన్నారు. మే 10 వరకు స్వీయగణనకు అవకాశం ఉందన్నారు. అవగాహన కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఇంధన వనరులు నిల్వ ఉంచితే చర్యలు

ఇంధన వనరులు నిల్వ ఉంచితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ అన్నారు. పెట్రోల్‌బంక్‌ యజమానులు, సేల్స్‌ ఆఫీసర్లతో కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. పెట్రోల్‌ కొరత లేకుండా చూడాలన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

డ్రగ్స్‌ నిర్మూలన అందరి బాధ్యత

డ్రగ్స్‌ నిర్మూలన అందరి బాధ్యత అని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. బాలల భద్రత, డ్రగ్స్‌ రహిత పోస్టర్‌ ఆవిష్కరించారు. మే 2 వరకు వారం పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement