జగిత్యాల: కుట్రలు, కుతంత్రాలను ఎదురించి ప్రజలందరినీ ఏకం చేసి రాష్ట్రం సాధించిన నేత కేసీఆర్ అని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, దేవేందర్‌నాయక్, కేసరిబాబు పాల్గొన్నారు.
జీవన్‌రెడ్డి స్వగృహంలో...
మాజీమంత్రి జీవన్‌రెడ్డి స్వగృహంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుర్గయ్య, హరిచరణ్‌రావు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ రమణ క్యాంప్ కార్యాలయంలో...
ఎమ్మెల్సీ ఎల్.రమణ క్యాంప్ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


