న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంలో పెద్దమ్మ తల్లికి ముదిరాజ్ కులస్తులు ఆదివారం బోనాలు చేశారు. ఐదేళ్లకోసారి పెద్దమ్మ తల్లిని అద్దకం కోసం రెండు వారాల క్రితం ఆలయం నుంచి సంఘం భవనానికి తీసుకొచ్చారు. అద్దకం చేసిన తర్వాత పోతరాజుల విన్యాసాల మధ్య ఊరేగింపుగా గ్రామశివారులోని అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠించారు. సర్పంచు బద్దం గోపి, టీజేఎస్ కోరుట్ల ఇన్‌చార్జి కంతి మోహన్‌రెడ్డి, మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, ఉపసర్పంచ్ నాంపెల్లి రమేశ్, మెట్‌పల్లి సీఐ సురేష్‌బాబు, ఎస్‌ఐ నవీన్‌కుమార్, ముదిరాజ్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


