సత్యనారాయణ వ్రతాలు | - | Sakshi
Sakshi News home page

సత్యనారాయణ వ్రతాలు

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

జగిత్యాలటౌన్‌: జిల్లాకేంద్రంలోని వాల్మీకి ఆవాసంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అన్నివర్గాల ప్రజలు వ్రతంలో పాల్గొంటారని, ఐక్యత, సమరసతతోపాటు భక్తి భావాన్ని పెంపొందించేందుకే ఈ వ్రతాలు నిర్వహిస్తున్నామని ఆవాసం కమిటీ అధ్యక్షుడు జిడిగె పురుషోత్తం తెలిపారు. సుమారు 200 జంటలు పాల్గొన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ సంచాలక్‌ భీమనాతిని శంకర్‌, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత, చిత్తారి మధుకర్‌, సురేష్‌, అశోక్‌రావు, అవాస ప్రముఖ్‌ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement