కలియుగ ఇష్టదైవమైన శ్రీపద్మావతి సమేతవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని సంకల్పించాం. మాది సామాన్య రైతు కుటుంబం. స్వామివారి ఆశీస్సులతో నా వంతుగా స్వామివారి ఆలయ నిర్మాణానికి రూ.కోటి వెచ్చించిన. ప్రస్తుతం అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాం.
– మరాటి సత్తయ్య, లంబాడిపల్లి
దాతలు సహకరిస్తున్నారు
దాతల సహకారంతో శ్రీరామ మందిర నిర్మాణం చేపడుతున్నాం. రూ.2కోట్ల అంచనాతో పనులు ప్రారంభించాం. చాలామంది దాతలు ముందుకొస్తున్నారు. వారంరోజుల్లోనే రూ.40లక్షలు విరాళాలు సేకరించాం. నిర్మాణాలకు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తుండడం అభినందనీయం. – జనార్ధన్ రెడ్డి, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్
ఆలయాలతో ఆధ్యాత్మికత
ఆలయాల నిర్మాణంతో హిందూ సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణతోపాటు, ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పూజలతో ప్రజల్లో మానసిక ప్రశాంతతతోపాటు, శాంతియుత జీవన విధానానికి తోడ్పడుతుంది. సామూహిక పూజా కార్యక్రమాలతో ప్రజల్లో ఐక్యత పెంపొందుతుంది.
ప్రణీత్ శర్మ, పురోహితులు, మల్యాల


