జగిత్యాలటౌన్: ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో బస్సులను యథావిధిగా నడిపించనున్నట్లు జేఏసీ నాయకులు శంకర్‌రెడ్డి, రామయ్య తెలిపారు. సమ్మె విరమించి విధులకు హాజరవుతామని పేర్కొన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్‌గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, రమేశ్‌రావు, ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు
ఇబ్రహీంపట్నం: రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందిస్తున్నామని జిల్లా పట్టు పరిశ్రమ అధికారి లత అన్నారు. మండలంలోని మూలరాంపూర్‌లో రైతులు ఏర్పాటు చేసుకున్న డ్రిప్ పరికరాలను పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90శాతం, సన్న, చిన్నకారు రైతులకు 80 శాతం, ఇతరులకు 70 శాతం సబ్సిడీపై పరికరాలు సరఫరా చేస్తున్నామని, ఆసక్తి గలవారు ఉద్యాన అధికారులను సంప్రదించాలని సూచించారు. ఉద్యాన అధికారి కే.శ్రీనివాస్, విస్తరణ అధికారి శ్రీలత, ఇంజినీర్ సాయికృష్ణ పాల్గొన్నారు.
టీబీ నియంత్రణపై అవగాహన కల్పించాలి
మల్యాల: టీబీ నియంత్రణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నూకపల్లిలో క్షయ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల నుంచి తెమడ సేకరించారు. ఊపిరితిత్తుల్లో దుమ్ము, దూళి చేరి క్షయవ్యాధి సోకే ప్రమాదం ఉంటుందని, సకాలంలో పరీక్ష చేయించుకుని తొలిదశలో గుర్తిస్తే నియంత్రించవచ్చని పేర్కొన్నారు. మొబైల్ ఎక్స్‌రే యంత్రం ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చని అన్నారు. పీహెచ్‌ఈఎన్ నాగలక్ష్మీ, హెచ్‌ఈఓ రమేశ్, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
దోమలు నివారించాలి
జగిత్యాల: దోమల నివారిస్తే మలేరియా రాకుండా అడ్డుకోవచ్చని శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మలేరియా దోమకాటుతో వచ్చే వ్యాధి అన్నారు. జ్వరం వస్తే రక్త పరీక్ష చేయించుకోవాలన్నారు. ప్రోగ్రాం అధికారి అర్చన, స్రవంతి, శ్రీధర్, మురళీధర్ పాల్గొన్నారు.
అధికారుల విచారణ
జగిత్యాలక్రైం: సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన పంచాయతీ కార్యదర్శి అనుమతివ్వడం లేదంటూ లబ్ధిదారు రేగుంట గంగు శుక్రవారం పంచాయతీ కార్యదర్శికి రూ.50 వేలు ఇచ్చేందుకు వెళ్లిన విషయం తెల్సిందే. దీనిని శ్రీఇందిరమ్మ ఇంటికి అనుమతివ్వడం లేదని..శ్రీ శీర్షికన శ్రీసాక్షిశ్రీ కథనం ప్రచురించడంతో స్పందించిన ఎంపీడీవో సలీం శనివారం గ్రామానికి వెళ్లి గంగును విచారించారు. పంచాయతీ కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గంగుపై ఫిర్యాదు
గంగు తన విధులకు ఆటంకం కలిగించిందన్న పంచాయతీ కార్యదర్శి మహ్మద్ అరిఫోద్దీన్ సారంగాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టినట్లు ఎస్సై గీత తెలిపారు.


