కోరుట్ల: పట్టణంలోని గడి బురుజుల స్థలంలో వీఎల్‌టీలు రద్దు చేయాలని, తైబజార్ వసూలు చేయొద్దని స్థానిక కార్గిల్ చౌరస్తా వద్ద అఖిలపక్షాల ప్రతినిధులు, కూరగాయల వ్యాపారులు శనివారం రాస్తారోకో చేశారు. బురుజుల స్థలంలో అక్రమంగా వేసిన వీఎల్‌టీ నంబర్లు రద్దు చేయించాలన్నారు. తమకు వసతులు కల్పించి తైబజార్ రద్దు చేయించాలని మహిళా రైతులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత భర్త, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ ఘటన స్థలానికి చేరుకున్నారు. వీఎల్‌టీల విషయంలో పూర్తి వివరాలు పరిశీలిస్తామని అక్రమంగా వేసినట్లు గుర్తిస్తే రద్దు చేయిస్తామన్నారు. అవసరమైతే కలెక్టర్‌తో మాట్లాడుతామన్నారు. కూరగాయల వ్యాపారులకు సౌకర్యాల కల్పనలో చర్యలు తీసుకుంటామన్నారు. అఖిలపక్షాల ప్రతినిధులు చెన్న విశ్వనాథం, పేట భాస్కర్, ముజాహిద్, చింత భూమేశ్వర్, ముజబుర్ రహ్మన్, మహ్మద్ షేక్ షాహిద్, నగేష్, సుతారి రాములు, మానుక ప్రవీన్‌కుమార్, శికారి గోపి, కూరగాయల వ్యాపారులు పాల్గొన్నారు.
వసతుల కోసం రోడ్డెక్కిన కూరగాయల రైతులు
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడి హామీతో విరమణ


