బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటుగానే టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటుగానే టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌(వేములవాడ): బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటుగానే కొత్తగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించిన ట్లు భావిస్తున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని కలిగోటలో విలేకరులతో మాట్లాడారు. కవిత ప్రశ్నలకు బీఆర్‌ఎస్‌ నేతలు సమాధానం చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఏనా డూ ప్రజల పక్షాన నిలబడలేదని కవిత అనడం ద్వారా ఇన్నాళ్లు ఎంత ఘోరం జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఫోన్‌లో మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండాపోయిందనడంపై ఫోన్‌ ట్యాపింగ్‌ జరి గినట్లు చెప్పకనే చెప్పారని తెలిపారు. మాజీమంత్రి హరీశ్‌రావు, ఎంపీ సంతోష్‌రావు ఇళ్లు బంగారుమయం అయ్యాయనడం ద్వారా ఆ నలుగురే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అప్పట్లో కాంగ్రెస్‌ చేసిన ఆరోపణకు బలం చేకూరినట్లయ్యిందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రజలకు దగ్గరగా లేవని, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇనిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వమే చేరువలో ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించామన్నారు.

పీహెచ్‌సీ ప్రారంభం

ముందుగా అంబారిపేటలో రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనాన్ని కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. సూరమ్మ ప్రాజెక్టును పరిశీలించారు. పీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఆర్డీవో జివాకర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో సుజాత, డిప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, వైద్యాధికారి రచన, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, కల్లెడ గంగాధర్‌, జవ్వాజి రవి, కారపు గంగాధర్‌, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement