భూభారతి సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

భూభారతి సమస్యలు పరిష్కరించాలి

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల: రెవెన్యూ సదస్సుల్లో భూభారతి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నా రు. శనివారం అధికారులతో సమీక్షించారు. సాదా బైనామా, అసైన్డ్‌ భూములు, డిజిటలైజేషన్‌ వంటి అంశాలను పూర్తి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు, డిపాల్టర్‌ రైస్‌మిల్లర్లపై ఆర్వోఆర్‌ చట్టం ప్రకారం తీసుకునే చర్యలు, ఇసుక నిర్వహణ, తడి భూముల నిర్వహణ, సీఏ భూములపై పరిశీలించా లన్నారు. ఆర్డీవోలు మధుసూదన్‌, జివాకర్‌రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.

అందుబాటులోకి స్వీయగణన

జనగణనలో తొలిసారిగా స్వీయగణన సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. జనగణన ఈనెల 26 నుంచి మే10 వరకు కొనసాగుతుందని, వెబ్‌సైట్‌ E.CENU.GOV.IN పోర్టల్‌ ద్వారా ప్రజలు తమ కుటుంబ వివరాలను 10–20 నిమిషాల్లో నమోదు చేసుకోవచ్చని, ప్రత్యేకమైన ఐడీ పొందవచ్చన్నారు. ఐడీని భద్రపర్చుకోవాలని, ఎన్యుమరేటర్‌ ఇంటికి వచ్చినప్పుడు చూపించాలన్నారు. ఉద్యోగులు, సిబ్బంది స్వీయ లెక్కింపులో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement