‘దేవి పుత్రిక’ అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

‘దేవి పుత్రిక’ అభినందనీయం

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

జిల్లా అదనపు, సెషన్స్‌ జడ్జి నీరజ

కరీంనగర్‌: ఆడపిల్ల పుడితే భారమనే వివక్షను వీడి, లక్ష్మిదేవిలా భావించినప్పుడే సమాజంలో లింగనిష్పత్తి తేడాలు తొలగుతాయని జిల్లా అదనపు, సెషన్స్‌ జడ్జి నీరజ అన్నారు. కరీంనగర్‌లో రోహన్‌ ఆసుపత్రి ప్రారంభించి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ‘దేవిపుత్రిక’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఆడపిల్ల పుడితే నార్మల్‌ డెలివరీ అయినా, సిజేరియన్‌ అయినా సంవత్సరం పాటు పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు ఎనమల్ల శ్రీదేవి, ఎనమల్ల నరేశ్‌ ముందుకొచ్చారు. శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీఎన్‌ రావుతో కలిసి ‘దేవిపుత్రిక’ పోస్టర్‌ ఆవిష్కరించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో ఆడపిల్లల విషయంలో ఉన్న వివక్షను తొలగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.

జిల్లాలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో శనివారం 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో అత్యధికంగా 44.1 డిగ్రీలు నమోదు కాగా.. అత్యల్పంగా కొడిమ్యాల మండలం తిర్మలాపూర్‌లో 41.5 డిగ్రీలుగా నమోదైంది. మల్లాపూర్‌ మండలం రాఘవపేటలో 44, ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లి, కొడిమ్యాల మండలం పూడూరులో 43.9, బీర్‌పూర్‌ మండలం కొల్వాయిలో 43.8, కోరుట్ల మండలం అయిలాపూర్‌లో 43.8, ఎండపల్లి మండలం గుల్లకోటలో 43.7, కోరుట్లలో 43.6, బుగ్గారం మండలం సిరికొండ, ధర్మపురి మండలం జైన, ఇబ్రహీంపట్నం గోదూరులో 43.5, మల్లాపూర్‌లో 43.4, రాయికల్‌లో 43.3, మేడిపల్లి, పెగడపల్లిలో 43.2, గొల్లపల్లిలో 43 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు

జగిత్యాలక్రైం: బీర్‌పూర్‌ మండలకేంద్రంలో ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అదేగ్రామానికి చెందిన చీర్నేని బుచ్చన్నకు తీవ్రగాయాలయ్యాయి. బుచ్చన్న తన ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా.. జన్నారం నుంచి జగిత్యాలకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బుచ్చన్న తలకు తీవ్రగాయాలుకాగా.. స్థానికులు 108 ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బీర్‌పూర్‌ ఎస్సై రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తి అరెస్ట్‌

జగిత్యాలక్రైం: జగిత్యాలకు చెందిన బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో, కిడ్నాప్‌, అత్యాచారం కేసులు నమోదు చేసి నింది తుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కరుణాకర్‌ తెలిపారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో ని వాసముంటున్న మనువాడ విష్ణువర్దన్‌ కొద్దిరోజు ల క్రితం పట్టణానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్‌ చే సి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యా దు మేరకు నిందితుడిని రిమాండ్‌కు పంపించినట్లు సీఐ తెలిపారు.

విజిలెన్స్‌ విచారణకు కమిషనర్‌ హాజరు

కోరుట్ల: పట్టణంలోని మద్దులచెరువులో గుర్ర పు డెక్క తొలగింపును టెండర్లు పిలవకుండానే చేయడంపై మాజీ కౌన్సిలర్‌ ఇందూరి సత్యం మున్సిపల్‌ డీఎంఏకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. దీని పై వరంగల్‌లో శనివారం విజిలెన్స్‌ విచారణ చేపట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌, డీఈ సురేశ్‌, ఫిర్యాదుదారు సత్యం హాజరయ్యారు. వరంగల్‌ ఆర్‌జేడీ ఆధ్వర్యంలో విచారణ సాగింది. టెండర్లలో అక్రమాలపై పూర్తి వివరాలు విజిలెన్స్‌ అధికారులు అందించామని సత్యం తెలిపారు.

ఈతకొడుతుండగా పిట్స్‌.. యువకుడి మృతి

రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ శివారులోని చెరువుకట్ట సమీపంలో నివాసముండే బుడిగజంగాల కుటుంబానికి చెందిన పస్తం పవన్‌(18) శనివారం ఈతకొడుతుండగా పిట్స్‌ రావడంతో నీటమునిగి చనిపోయాడు. మరోఇద్దరు యువకులతో కలిసి చెరువులో ఈదుతుండగా పిట్స్‌ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. యువకుడు కొన్నేళ్లుగా పిట్స్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా పస్తం రాంచందర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పవన్‌ ఉన్నాడు. రాంచందర్‌కు ఉన్న ఏకై క కుమారుడు పవన్‌ మృత్యువాత పడడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement