జగిత్యాల: జగనణన పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. జిల్లాకేంద్రంలో జనగణనకు సంబంధించిన ఎన్యుమరేటర్లకు శిక్షణ కల్పిస్తున్నారు. జనగణన దేశభవిష్యత్ ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు, ప్రణాళికకు ఉపయోగపడుతుందన్నారు. సందేహాలుంటే సూపర్‌వైజర్లు, చార్ట్ ఆఫీసర్లు అవగాహన కల్పిస్తారన్నారు. స్వీయగణన చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. పీఆర్టీయూ అధ్యక్షుడు ఆనందరావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించేలా చూడాలన్నారు. జగిత్యాల రూరల్ తహసీల్దార్ హకీం, ఫీల్డ్ ట్రైనర్లు మచ్చ రాజశేఖర్, కస్తూరి శ్రీధర్, రాజేందర్, హరికిరణ్, కొక్కుల రాజేశ్, రాజశేఖర్ పాల్గొన్నారు.
గ్రామసభల ద్వారా రీసర్వే చేయాలి
జగిత్యాలరూరల్: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన భూ సర్వే, రీసర్వే పనులను వేగవంతం చేయాలని లత అన్నారు. బీర్‌పూర్ మండలం నేదునూలో భూముల రీసర్వేపై అవగాహన కల్పించారు. ఆర్డీవో మధుసూదన్, బీర్‌పూర్ తహసీల్దార్, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.


