కోరుట్ల: జనగణన– 2027 ప్రక్రియలో ఎన్యూమరేటర్లు కచ్చితమైన గణాంకాలు సేకరించాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని పీఎం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. జనగణనకు ప్రజల సహకారం తీసుకోవాలన్నారు.
కూలీలకు వసతులు కల్పించాలి
కథలాపూర్(వేములవాడ): ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఉపాధి కూలీలకు పని ప్రదేశాల వద్ద నీడ, తాగునీటి వసతులు కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో మాట్లాడారు. కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీవో జివాకర్‌రెడ్డి, డీఆర్డీవో రఘువరణ్, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో శంకర్, ఏపీవో కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.


