సాతారంలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ | - | Sakshi
Sakshi News home page

సాతారంలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

మల్లాపూర్‌(కోరుట్ల): రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికొకటి చొప్పున 100 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేయనుండగా, పైలట్‌ ప్రాజెక్టుగా మల్లాపూర్‌ మండలం సాతారం హైస్కూల్‌ను ఎంపిక చేశారు. రూ.16.62 కోట్ల అంచనా వ్యయంతో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు తరగతులు నిర్వహించేలా ఏర్పాటు చేయనున్నారు.

అధికారుల బృందం సందర్శన

మండలంలోని సాతారం జెడ్పీ పాఠశాలతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు కోసం శుక్రవారం ఇంజనీరింగ్‌ అధికారుల బృందం సందర్శించింది. ఏఈలు శశికుమార్‌, ధనుంజయ్‌, సర్పంచ్‌ పోతవేని నారాయణ, పంచాయతీ కార్యదర్శి వినోద్‌, పాఠశాల హెచ్‌ఎం శ్రీహరి హైస్కూల్‌ను పరిశీలించారు. తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు అవసరమైన కొలతలు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement