జగిత్యాల: బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. ఈనెల 20న కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించి బుధవారం పార్టీ కార్యాలయంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. యువత పెద్ద ఎత్తున సభకు తీసుకువచ్చేలా చూడాలన్నారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిపారు. కార్యకర్తలంతా ఐక్యతతో కృషి చేసి ఘనవిజయం చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు


