ధర్మపురి: ధర్మపురి అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి అడ్లూరితో కలిసి ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. బల్దియాలోని 15వార్డులనూ కాంగ్రెస్ గెలుచుకుందని పేర్కొన్నారు. నృసింహుని ఆలయానికి నిత్యం వేలాది మంది వస్తారని, గోదావరిలో స్నానాలు ఆచరిస్తారని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మీ, వైస్ చైర్మన్ రామన్న, నాయకులు వేముల రాజు ఉన్నారు.
సీఎంకు ధర్మపురి ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి


