ఇంటిపైనుంచి పడి యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ఇంటిపైనుంచి పడి యువకుడు మృతి

Apr 16 2026 10:36 AM | Updated on Apr 16 2026 10:36 AM

రాయికల్‌: మండలంలోని కట్కాపూర్‌కు చెందిన కని కుట్ల నాగరాజు (27) మద్యం మత్తులో ఇంటిపైనుంచి పడి మృతిచెందినట్లు ఎస్సై సుధీర్‌రావు తెలిపారు. నాగరాజు కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇంటి పైనుంచి కింద పడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొన్నారు. నాగరాజు తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

చికిత్స పొందుతూ బాలుడు మృతి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): కుక్క వెంటబడడంతో కిందపడి తలకు గాయాలైన బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన తంగళ్లపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన సంగీత, మహేశ్‌ దంపతులకు కొడుకు ఇటికాల ఆదిత్య(8). గత 18 రోజుల క్రితం ఇంటి వద్ద ఆడుకుంటుండగా కుక్క వెంటపడింది. భయంతో పరుగెత్తిన బాలుడు కిందపడడంతో తలకు గాయమై రక్తం గడ్డకట్టింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు.

చెరువులో పడి వృద్ధుడి..

కరీంనగర్‌: ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన వెల్గటూర్‌ మండలం ముక్కట్రావుపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన అంకతి పెద్ద కోటయ్య (65) ఎప్పటిలాగే ఇంటినుంచి పశువులు మేపడానికి వెళ్లాడు. పశువులు చెరువులోకి వెళ్లగా.. వాటిని బయటకు రప్పించేందుకు పెద్ద కోటయ్య నీటిలో దిగాడు. ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ఉదయ్‌కుమార్‌ శవాన్ని చెరువులోంచి బయటకు తీయించారు. కోటయ్య కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

పోక్సో కేసులో యువకుడి రిమాండ్‌

రాయికల్‌: మండలంలోని ధర్మాజీపేటకు చెందిన మధును పోక్సో కేసులో బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సుధీర్‌రావు తెలిపారు. తాట్లవాయి గ్రామానికి చెందిన ఓ బాలికపై అత్యాచారం విషయంలో మధును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement