కొత్తపల్లి(కరీంనగర్): సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) బుధవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్‌లోని అల్ఫోర్స్ హైస్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సంచలన మార్కులు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. స్థానిక అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించారు. 103 మంది విద్యార్థులు 500 మార్కులకు 450 సాధించి జిల్లా స్థాయిలో చరిత్ర సృష్టించారని తెలిపారు. సానీక 494 మార్కులు, ఆదిత్య 492, ఎం.శ్రీహిత, ఏ.హర్ష, ఏ.శ్రీనిత 490, కే.ఓంకార్తికేయ, కె.అస్మిత, కే.అభిజ్ఞ 488, ఏ.స్వరవిస్తృతి 487, ఎం.శ్రీగౌరీ 486, కె.వర్దిని 485, ఉదయశ్రీ, వి.అభిరామ్ 484, కే.మోక్స్, జి.సాయి సుశేన్, ఈ.ప్రమేష్ రెడ్డి 483 మార్కులు సాధించడం హర్షణీయమన్నారు. పలువురు విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో వందశాతం మార్కులు సాధించడం సంతోషకరమన్నారు. విద్యార్థులకు చక్కటి ప్రణాళిక, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన అందిస్తూ జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక పరీక్షల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


