కరీంనగర్ టౌన్: సీబీఎస్‌ఈ పదోతరగతి ఫలితాల్లో కరీంనగర్‌లోని పారమిత హెరిటేజ్ పాఠశాల, పారమిత వరల్డ్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. 500కు 492 మార్కులతో చెన్న శ్రీశాంత్ జిల్లాలో మొదటిస్థానం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.గోపికృష్ణ తెలిపారు. మొత్తం 347 మంది 100శాతం ఉత్తీర్ణతతో అద్భుత ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఎం. శ్రీవర్షిణి 487, కె.అగస్త్య 486, ఎం.పంజ్వాని 485, గంప సహస్త్ర 485, ఎం.రాహుల్ 485, సీహెచ్. వెంకట మోక్షిత్ 485, దియా బుల్డాక్ 483, ఎం.సాయిఅక్షర 481, ఎండీ. అబ్దుల్ అరహాన్ లతీఫ్ 481, పి.రిధి 480 మార్కులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను పారమిత పాఠశాలల అధినేత డా. ఇ. ప్రసాద రావు ప్రత్యేకంగా అభినందించారు. డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, వినోదరావు, రశ్మిత, రాకేష్, వి.యూ.ఎం.ప్రసాద్, హన్మంతరావు, ప్రధానోపాధ్యాయులు పి.గోపికృష్ణ, సమన్వయకర్తలు రవీంద్ర పాత్రో, నాగరాజు, రాము పాల్గొన్నారు.


