జగిత్యాలక్రైం: చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాల నివారణ సాధ్యమని జిల్లా అగ్నిమాపక అధికారి సైదులు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్, టవర్ సర్కిల్ ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది మాక్‌డ్రిల్స్ నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు భయాందోళనకు గురికావద్దన్నారు. జగిత్యాల స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కృష్ణకాంత్, సిబ్బంది రవీందర్, మధు, మల్లేశం, వెంకటేశ్వర్లు, ప్రణయ్, కార్తీక్, రాజేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉత్తమ పనితీరుకు పట్టం
కరీంనగర్: ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఎండపల్లి మండలంలోని గుల్లకోట ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం చందూరి రాజిరెడ్డిని బుధవారం విద్యా సంచాలకులు నవీన్ నికోలస్ శాలువాతో సన్మానించారు. దాతల సహకారంతో లక్షలాది రూపాయలు విరాళాలు సేకరించి ప్రైవేటుకు ఽధీటుగా అభివృద్ది చేసినందుకు ప్రశంసపత్రం అందించారు. విద్యార్థుల శ్రేయస్సుకు కృషి చేసినందుకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందని రాజిరెడ్డి తెలిపారు. డీఈవో రాము, ఎండపల్లి ఎంఈవో హరికృష్ణ, సర్పంచ్ గొల్లపెల్లి మల్లేశం రాజిరెడ్డిని అభినందించారు.


