24 గ్యాస్‌ సిలిండర్లు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

24 గ్యాస్‌ సిలిండర్లు సీజ్‌

Apr 16 2026 10:36 AM | Updated on Apr 16 2026 10:36 AM

19 మందిపై 6ఏ కేసు నమోదు

జగిత్యాలక్రైం: జగిత్యాల సివిల్‌ సప్‌లై అధికారులు జిల్లాకేంద్రంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టి 24 సిలిండర్లను పట్టుకున్నారు. వాటిని సీజ్‌ చేసి 19 మందిపై 6ఏ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వ్యాపారాలకు వాడితే చర్యలు చేపడతామన్నారు. డీటీలు శ్రీనివాస్‌, ఉమాపతి, రాజేందర్‌రావు, ఎఫ్‌ఐ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

లేగదూడపై చిరుత దాడి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లె గ్రామంలో లేగదూడపై మంగళవారం రాత్రి చిరుత దాడిచేసి హతమార్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. పోతిరెడ్డిపల్లెకు చెందిన సదుల పూర్ణ గ్రామ శివారు ప్రాంతంలో నివసిస్తుంది. రాత్రి వారి గుడిసెల వద్ద గేదె, దూడను కట్టేయగా, తెల్లవారుజామున లేచి చూసేసరికి చిరుతదాడిలో చనిపోయి ఉంది. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిరుత సంచారంతో రాత్రిపూట వ్యవసాయ బావుల వద్దకు వెళ్లడానికి రైతులు జంకుతున్నారు. రైతులు రాత్రిపూట పోలాల వద్దకు కర్రలతో గుంపులుగా వెళ్లాలని ఒంటరిగా వెళ్లవద్దని అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి మోహన్‌లాల్‌ కోరారు.

గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన పడిగెపాటి వెంకటేశ్వర్‌రెడ్డి (52) ్చపురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్‌రెడ్డి గొల్లపల్లిరోడ్‌లో ఆటోస్టోర్‌ నిర్వహిస్తాడు. ఇటీవల అప్పులు ఎక్కువ కావడంతో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురయ్యాడు. వారం క్రితం గడ్డిమందు తాగగా కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సదాకర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement