మైనార్టీలో ఓ మతానికి చెందిన పెద్దలు సర్టిఫికెట్లను గుట్టుగా విక్రయిస్తుండడంపై జోరుగా చర్చ సాగుతోంది. రూ.30 నుంచి రూ.50వేల వరకు తీసుకొని ఇతర మతాలకు చెందిన వారికి వెంటనే ఆ మతం సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు.
అడ్డదారుల్లో పదవులు పొందాలనుకునే నాయకులకు ఈ సర్టిఫికెట్లు
ఇప్పటి వరకు పలు మున్సిపాలిటీల్లో ఈ సర్టిఫికెట్లతో ఎంతోమంది మైనార్టేతర నాయకులు దర్జాగా పదవులు పొందారు.
ప్రస్తుతం జరగబోయే కోఆప్షన్ ఎన్నికలకు కూడా ఇప్పటికే పలువురు ఆ మతం సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
ప్రతి ఎన్నికల్లో ఇదంతా కళ్లముందే జరుగుతున్నప్పటికీ మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మైనార్టీ పదవులపై మైనార్టేతర నాయకుల కన్ను
ఓ మైనార్టీ మతం సర్టిఫికెట్లతో దరఖాస్తు
మున్సిపాలిటీల్లో ఆ వర్గం ప్రాధాన్యానికి గండి
‘మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఓ నాయకుడు మున్సిపల్ కో–ఆప్షన్ పదవిపై
ఆశలు పెట్టుకున్నాడు. నిబంధనల ప్రకారం ఆయన ఉన్న నాలుగు పదవుల్లో దేనికీ అర్హుడు కాదు. అయినప్పటికీ ఎలాగైనా పదవి పొందాలనుకున్న సదరు నాయకుడు మైనార్టీ వర్గానికి కేటాయించిన పదవులపై కన్నేశాడు. వెంటనే కరీంనగర్‌కు వెళ్లి రూ.40వేలు చెల్లించి ఓ మతానికి చెందిన వ్యక్తిగా సర్టిఫికెట్ తీసుకున్నాడు. ఆ సర్టిఫికెట్‌తో కో–ఆప్షన్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు.’
మెట్‌పల్లి: మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ పదవుల కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. మైనార్టీలు కాకపోయినప్పటికీ ఆ వర్గానికి కేటాయించిన పదవులను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మైనార్టీలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించడం కోసం ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఎంపిక చేసే కోఆప్షన్ పదవుల్లో కొన్నింటిని ప్రత్యేకంగా ఆ వర్గాలకే కేటాయించింది. అయితే మైనార్టీలు కాకుండా ఆ పదవుల్లో కొన్నింటిని మైనార్టేతరులు పొందుతుండడం వివాదాస్పదమవుతోంది.
జిల్లాలో మైనార్టీలకు పది పదవులు..
అమ్మకానికి మతం సర్టిఫికెట్లు
దోహదపడుతున్నాయి.


