అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

జగిత్యాలరూరల్‌: అగ్నిప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన అవసరమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. ఈనెల 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ముద్రించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు గ్రామగ్రామాన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణకాంత్‌, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

జగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసు శాఖ చర్యలు చేపట్టిందని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో రోడ్డు భద్రతపై అవగాహన, ప్రతిజ్ఞ చేయించామన్నారు. బ్లాక్‌స్పాట్ల ప్రాంతాలను పరిశీలించారు. జీబ్రాలైన్స మరమ్మతు, రోడ్డులైన్‌ మార్కింగ్స్‌, రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేయించారు. రోడ్డు భద్రత కేవలం పోలీసులది మాత్రమే కాదని, పౌరులందరిదీ అని తెలిపారు. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ వినియోగం తప్పనిసరి అని పేర్కొన్నారు.

కేసీఆర్‌ సభపై సన్నాహక సమావేశం

మల్యాల: జిల్లాకేంద్రంలో ఈ నెల 20న నిర్వహించనున్న కేసీఆర్‌ బహిరంగ సభకు గ్రామా ల నుంచి వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కోరారు. మంగళవారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులతో సమావేశమయ్యారు. కేసీఆర్‌ బహిరంగ సభకు జన సమీకరణపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జనగం శ్రీనివాస్‌, మాజీ జెడ్పీటీసీ కొండపల్కల రాంమోహన్‌రావు, మాజీ ఎంపీపీ తైదల శ్రీలత, మాజీ సర్పంచ్‌ రౌతు రవి వర్మ, బద్దం తిరుపతి రెడ్డి, ప్యాక్స్‌ మాజీ చైర్మన్‌ బోయినపల్లి మధుసూదన్‌రావు, భూపతిరెడ్డి, పాల్గొన్నారు.

మలయశ్రీ సాహిత్యం భావి తరాలకు మార్గదర్శకం

కరీంనగర్‌కల్చరల్‌: మలయశ్రీ సాహిత్య సేవలు అపారమని, ఆయన రచనలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని కసప శ్యామ్‌ సుందర్‌ అన్నారు. మంగళవారం నగరంలోని ఐఏంఏ హాల్‌లో వివిధ సాహితీసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖ కవి మలయశ్రీ సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించి మాట్లాడారు. తాను నమ్మిన ఆశయం కోసం చివరి శ్వాస వరకు నిలపడిన ఆచరణ వాది అన్నారు. ఆయన జీవిత చరిత్రను తీసుకురావాల్సిన అవసరం ఉందని, విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సభలో పాల్గొన్న వక్తలు తెలియజేశారు. కవులు గండ్ర లక్ష్మణరావు, నలిమెల భాస్కర్‌, బీఎన్‌.రావు, గాజోజు నాగభూషణం, సేనాధిపతి, సూరేపల్లి సుజాత, సబ్బని లక్ష్మీనారాయణ, సంకేపల్లి నాగేంద్ర శర్మ, మాడిశెట్టి గోపాల్‌ పాల్గొన్నారు.

నర్సింగ్‌ ఆఫీసర్‌గా ఎంపికై న యువకుడికి సన్మానం

కథలాపూర్‌: మండల కేంద్రానికి చెందిన మిట్టపెల్లి జాన్‌ అనే యువకుడు నర్సింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగం సాధించగా, ఎమ్మార్పీఎస్‌ నాయకులు మంగళవారం సన్మానించారు. నేటి యువత జాన్‌ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి కాశవత్తుల లక్ష్మిరాజం, మండల నాయకులు వినోద్‌, కిషన్‌ బ్రదర్‌, అంజయ్య, గంగారెడ్డి, గంగాధర్‌, రవి, గణేశ్‌, రాజు, ప్రేమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement