రాయికల్: రాయికల్ వంటి చిన్న మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లలో ఇంటి యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో బల్దియాకు ఆదా యం రావడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా ఎర్లీబర్డ్ స్కీం ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఐదు శాతం రాయితీ వర్తింపజేస్తోంది. ఈ క్రమంలో ముందస్తుగా ఆస్తిపన్ను రాబట్టే దిశగా మున్సిపల్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. బల్దియాలో సాధారణ నిధి కింద వచ్చే నల్లా, వర్తక పన్ను, వాణిజ్య ప్రకటనలపై వచ్చే ఆదాయంతో పోలిస్తే ఈ ఆస్తిపన్ను ఎంతో కీలకం. ముందస్తుగా వసూలు చేయడం ద్వారా బల్దియాకు ఆ దాయం సమకూరడంతోపాటు చెల్లింపుదారుల ను ప్రోత్సహించినట్లవుతుంది. ఈనెల 30 వరకు ఈ పథకం కింద చెల్లించే అవకాశం ఉంది.
అర్హులెవరంటే...
2026–27 ఆర్థిక సంవత్సరంలో నివాస, నివాసేతర ఆస్తులపై ఎలాంటి బకాయిలు లేకుండా పన్ను పూర్తిగా చెల్లించిన వారు ఈ ఎర్లీబర్డ్ పథకానికి అర్హులు అవుతారు. వీరికి మాత్రమే ఈ 5 శాతం రాయితీ వర్తించనుంది.
రాయికల్ బల్దియా సమాచారం
నివాస గృహాలు 4,658
వసూలు అంచనా రూ.కోటి
ప్రస్తుతం వసూలు రూ.5.50 లక్షలు


