బీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలి

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

మెట్‌పల్లిరూరల్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. మెట్‌పల్లి మండలం వెల్లులలో మంగళవారం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్ధేశం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ ఈనెల 20న జగిత్యాలలో జరిగే బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు బండలింగాపూర్‌లో అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలను ఆవిష్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement